గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:24 PM
గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశి రెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్, శ్రీరామ్‌న గర్, పంజుగుల, తుర్కలపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారం భించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోం దన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్యం, తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ స భ్యుడు అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బృంగి ఆనం ద్‌కుమార్, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, ప వన్‌కుమార్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.