పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:45 PM
పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- పల్స్ పోలియోను ప్రారంభించిన కలెక్టర్
- వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం
కందనూలు/ కల్వకుర్తి/ వంగూరు/ కొల్లాపూర్/ పదర, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఐదేళ్ల లోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ మ హత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఆదివా రం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రఽధాన ఆసుపత్రిలో నిర్వహించిన జాతీ య పల్స్ పోలియో కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ మునిసిపల్ చైర్మ న్ తీగల సునేంద్ర, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారం భించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారు లతో కలెక్టర్ ఆరాతీశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ లు, వ్యాక్సిన్ నిల్వలు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలు, రవాణా సౌకర్యాలు, ప్ర చార కార్యక్రమాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలు సుకున్నారు. మొదటి రోజు పోలియో కేంద్రాలకు రాని చిన్నారుల ను గుర్తించి తదుపరి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు 1,00,624మంది చి న్నారులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు 1,17,500డోసుల పోలియో వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచి నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 631పోలియో కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 20 మం డలాలు, 28 ప్రాథమక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిం టెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.