Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:21 PM

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆసిఫాబాద్‌ నియోజక వర్గ కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్‌ శిక్షణ తరగతుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మంచిర్యాల మాజీ జడ్పీ చైర్మన్‌ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

kumaram bheem asifabad- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆసిఫాబాద్‌ నియోజక వర్గ కార్యకర్తల సమ్మేళనం, సభ్యత్వ నమోదు, సర్‌ శిక్షణ తరగతుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మంచిర్యాల మాజీ జడ్పీ చైర్మన్‌ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. డిజిటల్‌ నమోదు వల్ల సభ్యుడి పూర్తి వివరాలు సులభంగా తెలుసుకునే వీలుంటుందని దీని కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌లో జిల్లా, నియోజక వర్గం, మండలం, గ్రామస్థాయిల వారీగా వివరాలతో పాటు సభ్యుల బ్లడ్‌ గ్రూపు, పూర్తి చిరునామా కూడా నమోదు చేస్తామన్నారు. గతంలో పుస్తకాల ద్వారా సభ్యత్వ నమోదు జరిగేదని చెప్పారు. దాని వల్ల తప్పుడు నమోదు జరిగేదని, అందుకే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సర్‌ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ నిజమైన ఓటర్లు, మరణించిన వారు, వలస వెళ్లిన వారిని గుర్తించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి పక్కా ఓటర్ల జాబితాను రూపొందించడమే సర్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని ప్రభుత్వ వైఫల్యాలను నెరవేర్చని హామీలను ప్రజల్లో ఎండగడుతూ పూర్తి స్థాయిలో పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 10:21 PM