kumaram bheem asifabad-ప్రభుత్వం పోడు రైతులకు అండగా ఉంటుంది
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:20 PM
పోడు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి అదిత అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ భూములను పోడు రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దీన్ని రాద్దాంతం చేస్తున్నదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పోడు రైతులకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవద్దని సూచించారు.
సిర్పూరు(టి), జూలై 12 (ఆంధ్రజ్యోతి): పోడు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి అదిత అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రెవెన్యూ భూములను పోడు రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దీన్ని రాద్దాంతం చేస్తున్నదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పోడు రైతులకు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవద్దని సూచించారు. కొత్త వారు సాగు చేయకుండా చూడాలని ఆమె తెలిపారు. గత శనివారం కుమురం భీం జిల్లాకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వచ్చిన సందర్భంగా డోర్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు పోడు రైతులు మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. అప్పటికప్పుడే అధికారులకు సూచనలు చేశారని అన్నారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు ఏ మాత్రం అడ్డుకోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విశ్వనాథ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హర్షద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.