Share News

విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:05 PM

తెలంగాణ రాష్ట్రం లో పేద, మధ్య తరగతి విద్యార్థు ల ఫీజులు ప్రభుత్వమే చెల్లించా లని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజ న్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి
మాట్లాడుతున్న కాళ్ల నిరంజన్‌

- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రం లో పేద, మధ్య తరగతి విద్యార్థు ల ఫీజులు ప్రభుత్వమే చెల్లించా లని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజ న్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రం లోని సంఘం కార్యాలయంలో ఆ సంఘం ము ఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫీ జులు చెల్లించకుండా కుట్రలు చేస్తోందని ఆరో పించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్ర వేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కే ఆలోచన చేస్తోం దని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ప్రభుత్వం చెల్లించకపోతే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించి విద్యార్థులను ఆదు కోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జా తీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, నిరంజన్‌ యాదవ్‌, గంగోజీ, నిరంజన్‌, నేష లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:05 PM