ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:40 PM
జిల్లా కేంద్రంలో ని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గరువారం ఘనంగా నిర్వహించారు.
- తెలంగాణ విమోచన దినోత్సవంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు
నాగర్‌కర్నూల్ టౌన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గరువారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వేములనరేందర్ రావు జాతీయ పతాకావిష్కణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి నాగేందర్‌గౌడ్, నాయకులు శ్రీశైలం, పద్మ యాదవ్, రవినాయక్, శ్రీనివాస్‌గౌడ్‌పాల్గొన్నారు.
ఫ వెల్దండ, (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిందం కృష్ణయ్య, కృష్ణారెడ్డి, గంగపురం పాండు, వెంకట్రాములు, మల్లేష్, కృష్ణ, జంగయ్య, శ్రీకాంత్, ఆనందు, సుశీల్ ఉన్నారు.