సింగరేణికి బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:09 PM
సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, బొగ్గు, విద్యుత్ కొనుగోళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావా ల్సిన బకాయిలు రూ. 55 వేల కోట్లను వెంటనే చెల్లిం చాలని బీజేపీ ఉపాధ్యాక్షుడు రఘునాథ్ వెరబెల్లి డి మాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
నస్పూర్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, బొగ్గు, విద్యుత్ కొనుగోళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావా ల్సిన బకాయిలు రూ. 55 వేల కోట్లను వెంటనే చెల్లిం చాలని బీజేపీ ఉపాధ్యాక్షుడు రఘునాథ్ వెరబెల్లి డి మాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, భద్రత ఆరు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 30న సీసీసీ కార్నర్ వద్ద సింగరేణి బకాయి-బీజేపీ లడాయి నిరసన దీక్షను చేప ట్టినట్లు తెలిపారు. ఈ నిరసన దీక్షకు రాష్ట్ర అఽధ్యక్షుడు రాంచందర్ రావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేం దర్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే లు హాజరు కానున్నరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఆగిపోవడం వలన కార్మికులకు సౌకర్యాలు, జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చాలా మంది కార్మికులు, రిటైర్డ్ కార్మికులు సంస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మునుపటి దుస్థితికి చేరే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన బకాయి ఉన్న రూ. 55 వేల కోట్లను తక్షణమే చెల్లించాలన్నారు. 2025-26 వాస్తవ లాభాలను ప్రకటించి 40 శాతం వాటాను కా ర్మికులకు చెల్లించాలన్నారు. ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మికులకు న్యాయం చేయా లన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చే యాలన్నారు. పనిముట్లు, సేఫ్టీ పరికరాలును సకాలం లో అందించాలన్నారు. డిస్మిస్ కార్మికులకు మరో సారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇంటి స్థలాలను ఇస్తామని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభు త్వాలు హామీలు గుప్పించి అమలు చేయకుండా మో సం చేశాయన్నారు. సింగరేణిని కాపాడేందుకు, కార్మి కుల హక్కులను సాధించుట కోసం నిరసన కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు రఘునాథ్ పెర్కొన్నారు. ఈ సమావేశంలో బీఎంఎస్ ఏరియా కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, కమాలాకర్ రావు, కుర్ర చక్రవర్తి, చిరంజీవి, పొన్నవేని సదయ్య, రవణవేని శ్రీనివాస్, సత్యనారాయణ, మహేందర్, రేణుక, శిరీష, సృజన, సమ్మయ్య, నరసయ్య, రమేష్ పాల్గొన్నారు.