దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:41 AM
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం కృషిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, మర్రిగూడ, జనవరి 27, (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం కృషిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు, మర్రిగూడకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆరుగురికి స్కూటీలు, నలుగురికి ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దివ్యాంగు ల సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్కూటీలు, ట్రై సైకిళ్లు మం జూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చండూరు ఏఎంసీ దోటి నారాయణ, సర్పంచి పాలకూరి రమాదేవి నరసింహగౌడ్, సీడీపీవో లావణ్యకుమారి, ఏసీడీపీవో వెంకటమ్మ, సూపర్‌వైజర్ శివేష, కిష్టాపురం మాజీ ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, మునుగోడు సీడీపీవో లావణ్య దేవి, మర్రిగూడ కాంగ్రెస్ ీనాయకులు వర్కాల వెంకటేష్, రమేష్ వెంకటరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.