Share News

ప్రభుత్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ... ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించడంపై లేదు

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:50 AM

: కాంగ్రెస్‌ ప్రభు త్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించడంపై లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పే ర్కొన్నారు.

ప్రభుత్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ...   ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించడంపై లేదు
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభు త్వానికి దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించడంపై లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పే ర్కొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుద ల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫీజు బకాయిల బీజేపీ లడాయి కార్యక్ర మంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని కళాశాలల విద్యార్థులతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లిం చకుండా మోసం చేశాయన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యా ర్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కళాశా లలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దీంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని, ఉద్యోగాలు సాధించలేకపోతున్నారన్నారు. ఇప్ప టికైనా ప్రభుత్వం వె ంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వ ర్‌గౌడ్‌, నాయకులు గణేష్‌, ఏతం శివకృష్ణ, బొలిశెట్టి అశ్విన్‌, అశోక్‌, తు ల ఆంజనేయులు, గాజుల ముకేష్‌గౌడ్‌, బొట్ల అనిత, కస్తూరి నాగరా జు, బేర సత్యనారాయణ, పెద్దపల్లి పురుషోత్తం, శ్రీదేవి, కృష్ణమూర్తి, క మలాకర్‌రావు, వెంకటకృష్ణ, స్వప్నరాణి, ప్రేమ్‌సింగ్‌, అమిరిశెట్టి రాజ్‌ కుమార్‌, కొండ వెంకటేష్‌, అశోక్‌, సాయిఠాకూర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:50 AM