ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:24 PM
ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌క ర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డిలు అన్నారు.
- అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి
- పలు చోట్ల ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీలు
కందనూలు/ ఉప్పునుంతల/ వంగూరు/ చా రకొండ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌క ర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డిలు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ర్యాలీని పాత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జెండా ఊపి ప్రారంభిం చారు. వారు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొ న్నారు. వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి అంకితభావంతో పని చేయాలన్నారు. కా ర్యక్రమంలో డాక్టర్ రవికు మార్, జీజీహెచ్ ఆర్ ఎంవో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ ప్రశాంత్, ప్రో గ్రామ్ అధికారులు సురేష్‌బాబు, డాక్టర్ కృష్ణ మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భరత్ కుమార్‌రెడ్డి, వైద్యాధికారులు సృజన, డాక్టర్ వాణి, ఆర్‌బీఎస్‌కే వైద్య సిబ్బంది, అధికారులు, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి గోపాల చారి పాల్గొన్నారు.
సూపర్‌వైజర్‌కు ప్రశంస
క్షయ వ్యాధి నిర్మూలన సూపర్‌వైజర్ శ్రీనివా స్‌ను ప్రశంసించారు. ఈ మేరకు అచ్చంపేట, నాగర్‌క ర్నూల్ ఎమ్మెల్యేలు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కూచ కుళ్ల రాజేశ్‌రెడ్డిలు మంగళ వారం పాత కలెక్టరేట్ కా ర్యాలయ ఆవరణలో ప్రశం సాపత్రం అందజేశారు. జి ల్లా వైద్యాశాఖాధికారి రవి కుమార్ మాట్లాడారు.
తూడుకుర్తిలో...
క్లాస్‌మేట్ క్లబ్ వ్యవస్థాపక ఫౌండర్ వాస రాఘవేందర్ సూచన మేరకు 97వ రోజు ప్రపం చ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని నాగర్‌క ర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామం లో ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు 120 వా టర్ బాటిల్స్‌ను గ్రామ వాసి చిగుళ్లపల్లి ఆనంద్ జ యంతి సందర్భంగా వారి కుమారులు రాహుల్, రామకృష్ణలు అందజేశారు. స్థానికంగా ఉన్న ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు ప్రేమ్‌కుమార్, రాజులు పాల్గొని విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమా వతి, ఉపాధ్యాయులు, క్లాస్‌మేట్ క్లబ్ ప్రతినిధి రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యాయురాలు మాధవి పాల్గొన్నారు.
ఫ ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల వైద్యాఽధికారి స్వప్న మాట్లాడుతూ ఆరోగ్యం ప్రతీ వ్యక్తికి అత్యంత మౌళిక హక్కు అని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో వైధ్యులు అభి లాస్, వద్యై సిబ్బంది ఉన్నారు.
ఫ వంగూరులో ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ భీమానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతాబాయి. సీహెచ్‌వో సుధాకర్, పద్మ, రోజమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ చారకొండలో మండల వైద్యాధికారి మంజుభార్గవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరి శుభ్రత పాటించడం వల్ల వ్యాధులను దూరం చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సృజన, డాక్టర్ జగన్‌లాల్, సీహెచ్‌వో బలరాం, ఎంఎల్‌హెచ్‌పీ ప్రియాంక, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.