సర్కారుకు శఠగోపం
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:19 PM
డీసీఎంఎస్ సెంటర్ ద్వారా వరి ధాన్యం కొనుగోళ్ల పేరుతో తప్పుడు లెక్కలు సృష్టించి పౌర సరఫరాల శాఖ నుంచి కోట్ల రూ పాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన ఘటన జైపూర్ మండలం కిష్టాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇ లా ఉన్నాయి.
వరి సాగు చేయకున్నా చేసినట్లు...
-తప్పుడు లెక్కలతో ప్రభుత్వ సొమ్ము స్వాహా
-డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో అవినీతి బాగోతం
-అధికారులకు ఫిర్యాదుతో వెలుగులోకి
-జైపూర్ మండలం కిష్టాపూర్‌లో ఘటన
మంచిర్యాల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): డీసీఎంఎస్ సెంటర్ ద్వారా వరి ధాన్యం కొనుగోళ్ల పేరుతో తప్పుడు లెక్కలు సృష్టించి పౌర సరఫరాల శాఖ నుంచి కోట్ల రూ పాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన ఘటన జైపూర్ మండలం కిష్టాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇ లా ఉన్నాయి. కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాదాసు రమేష్ గౌడ్‌కు స్థానికంగా డీసీఎంఎస్-1 ధాన్యం కొను గోలు కేంద్రం ఉంది. 2024-25 రబీ సీజన్‌కు సంబంధిం చి తన సెంటరు ద్వారా 25,604 టన్నుల ధాన్యాన్ని రై తుల నుంచి కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్ ప్యాడీ ప్రొ క్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టంలో సమాచారం నమో దు చేశాడు. కొనుగోలు చేసిన ధాన్యంలో సన్నరకం 5,600 క్వింటాళ్లు, దొడ్డు రకం మరో 8,700 క్వింటాళ్లు 53 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వివరాలు అప్‌లోడ్ చేశాడు. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి కిష్టాపూర్‌లో ఒకరిద్దరు రైతులే సన్నరకం సాగు చేయ గా, వంద క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. అయినప్ప టికీ సన్నరకం 5,600 క్వింటాళ్లు, దొడ్డు రకం 8,700 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చే శాడు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పౌ ర సరఫరాల శాఖ నుంచి క్వింటాకు రూ. 2,320 చొప్పు న మొత్తం 14,300 క్వింటాళ్లకు సంబంధించి రూ. 3 కో ట్ల 28 లక్షల 90వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. గ్రామంలో డీసీఎంఎస్ సెంటర్లు 2, డీఆర్‌డీఏ కేంధ్రం ఒకటి ఉండగా, మూడు సెంటర్లలో దాదాపు 36వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోళ్లు జరుగగా, ఒక్క డీసీ ఎంఎస్ -1 కేంద్రంలోనే 25,604 క్వింటాళ్లు కొనుగోలు చే సినట్లు నమోదు చేయడం గమనార్హం.
బంధు వర్గమే రైతులు...!
రమేష్‌గౌడ్ రైతుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి న వివరాలు ఆయన బంధువర్గానికి సంబంధించి నవే కావడం కొసమెరుపు. రమేష్‌గౌడ్ అక్క గట్టు సుగుణ పేరిట 244 క్వింటాళ్లు, బావ గట్టు మనోహర్‌గౌడ్ పేరి ట 187 క్వింటాళ్లు అల్లుడు గట్టు హరీష్ పేరిట 341 క్వింటాళ్లు, మరో అల్లుడు గట్టు అరుణ్ పేరిట 180 క్విం టాళ్లు కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయ గా, వారి పేరిట మొత్తం రూ. 22లక్షల 8వేల 640 బ్యాంకులో జమైంది. ప్రభుత్వ అంచనా మేరకు ఎకరా కు గరిష్టంగా 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. వాస్తవంగా రైతుకు వచ్చే దిగుబడి 30 క్వింటాళ్ల లోపే ఉంటుంది. ఇదిలా ఉండగా డీసీఎంఎస్ సెంటర్ నిర్వా హకుడు ఆన్‌లైన్‌లో పై నలుగురి పేరిట 952 క్వింటాళ్లు నమోదు చేశాడు. పై లెక్క ప్రకారం నలుగురి పేరిట మొత్తం 30 ఎకరాల భూమి ఉండాలి. నలుగురి పేరిట గ్రామంలో వరి పొలం సాగుకు పనికి వచ్చే భూమి కేవ లం నాలుగు ఎకరాలే ఉన్నట్లు గ్రామస్థుల ద్వారా తెలి సింది. వారు కౌలు వ్యయసాయం చేసిన దాఖలాలు కూడా లేవు. వారికున్న నాలుగు ఎకరాల్లో వరిపంట సా గు చేసినా మొత్తం దిగుబడి గరిష్టంగా 130 క్వింటాళ్లకు మించదు. అలాగే ముక్కెర నరేష్ అనే వ్యక్తి రమేష్‌గౌడ్ వద్ద పని చేస్తున్నాడు. అతనికి కిష్టాపూర్‌లో సెంటు భూమి కూడా లేదు. అయినప్పటికీ అతనికి 294 క్విం టాళ్ల దిగుబడి ఉన్నట్లు చూపించి, రూ. 6 లక్షల 72వేల పైచిలుకు నగదును స్వాహా చేశారు. తాటి లక్ష్మన్ స్వగ్రా మం పెద్దపల్లి జిల్లా మంఽథని. ఇతను డీసీఎంఎస్-1 సెంటర్‌లో ట్యాబ్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. కిష్టాపూర్‌లో అతనికి ఎలాంటి భూములు లేవు. అయి నా అతని పేరిట 386 క్వింటాళ్లు దిగుబడి చూపించగా, రూ. 8,87,800 జమ అయింది. జైపూర్ మండలం కుం దారం గ్రామానికి చెందిన అవునూరి రాకేష్ రమేష్‌గౌడ్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇతనికీ 371 క్వింటాళ్లు దిగుబడి చూపుతూ ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, రూ. 8 లక్షల 55 వేల పై చిలుకు నగదు బ్యాంకులో జమ అ యింది. గ్రామానికి చెందిన రామగిరి సత్యనారాయణకు ఎకరంన్నర భూమి ఉండగా, సన్నరకం 272 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా నమోదు చేశారు. ఇతని పేరిట రూ. 6 లక్షల 26వేల పైచిలుకు జమ అయింది. అలా గ్రామంలో సాగు చేయని ధాన్యాన్ని ఇతర రాష్ట్రా ల నుంచి కొనుగోలు చేసి, బినామీల పేరిట ప్రభుత్వా నికి అంటగట్టడం ద్వారా కోట్ల రూపాయలు స్వాహా చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో..
డీసీఎంఎస్-1 సెంటర్‌లో జరిగిన అక్రమాలపై గ్రా మానికి చెందిన లంబు శివప్రసాద్‌తోపాటు పలువురు స్థానికులు ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన ఆధారాలతో కలెక్టర్‌తోపాటు రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అవినీతి వెలు గులోకి వచ్చింది. గ్రామస్థుల ఫిర్యాదుతో పౌర సరఫరా ల శాఖకు చెందిన అధికారులు రెండు సార్లు గ్రామా న్ని సందర్శించి విచారణ జరిపారు. నెలలు గడుస్తున్నా ఘటనపై ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టక పో వడం గమనార్హం.