Share News

రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం

ABN , Publish Date - May 07 , 2026 | 11:35 PM

వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతు సంక్షే మాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య ఆరోపించారు.

రైతు సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వం
కలెక్టరేట్‌ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్న బీజేపీ, కిసాన్‌ మోర్చా నాయకులు

కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య

నస్పూర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతు సంక్షే మాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య ఆరోపించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ చౌరస్తా వద్ద జాతీయ రహ దారి పై ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బీజేపీ, కిసాన్‌ మో ర్చా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయా లని, వెంటనే రశీదును కూడా ఇవ్వాలని, అకాల వర్షం కారణంగా చనిపోయిన రైతులకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు పట్టు కుని రోడ్డుపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో కారణంగా ఇరువైపుల వాహనాల రాకపోకలు నిలిచిపోగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ద్విచక్ర, అటోలు, కార్లు తదితర వాహనాలను దారి మ ళ్లించారు. ఆందోళన చేస్తున్న నాయకులకు పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విర మింపజేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ఉరేగింపుగా వచ్చి కలెక్టరేట్‌ ఎదుట నినా దాలు చేసి కార్యాలయంలో ఏవో రాజేశ్వర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. లక్షెట్టిపేటలో అకాల వర్షం వలన చనిపోయిన రైతులకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. వర్షంలో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కష్ట పడి పండించిన ధాన్యం బ స్తాకు నాలుగు కిలోల తరుగు తీసి దోచుకుంటున్నరని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, రైస్‌ మి ల్లర్లు కుమ్మకై కమీషన్ల కోసం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నరని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కోసం లారీల కొరతను చూపి తరలించడంలో ప్ర భుత్వం జాప్యం చేస్తుందన్నారు. ఏలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని తక్షణమే కొ నుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకట్వేర్‌ గౌడ్‌, బీజేపీ, కిసాన్‌ మోర్చా నాయకులు దుర్గం అశోక్‌, కొయ్యల ఏమాజీ, కుర్ర చక్రి. సత్రం రమేష్‌, క మలాకర్‌ రావు, పొన్నవేని సదయ్య, సదానందం పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:35 PM