హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:35 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను విస్మరిం చిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ విమర్శిం చారు.
- మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
కల్వకుర్తి,జనవరి25 (ఆంధ్రజ్యో తి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను విస్మరిం చిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ విమర్శిం చారు. మునిసిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో వైఆర్‌ఆర్ కాం ప్లెక్స్‌లో రాంనగర్‌తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్లు ఎడ్మ సత్యం, రాచోటి శ్రీశైలం సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరారు. కల్వకుర్తి మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలి పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ షాహెద్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సింగం విజయ్‌గౌడ్, బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు భవాండ్ల మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వట్టెపు బాలయ్య, నాయకులు సూర్యప్రకాశ్‌రావు, ఎడ్మ భోజిరెడ్డి, నూనె శ్రీను, వెంకటయ్యగౌడ్, గోపి, తాహెర్ అలీ, నాయకులు పాల్గొన్నారు.