Share News

శాశ్వత పరిష్కారమే భూ రీసర్వే లక్ష్యం

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:32 PM

రా ష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి భూభారతి చట్టాన్ని సమర్థవం తంగా అమలు చేయాలంటే భూ రీసర్వేను అ త్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంఽధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారు లను ఆదేశించారు.

శాశ్వత పరిష్కారమే భూ రీసర్వే లక్ష్యం

- రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : రా ష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి భూభారతి చట్టాన్ని సమర్థవం తంగా అమలు చేయాలంటే భూ రీసర్వేను అ త్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంఽధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారు లను ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లా కలె క్టరేట్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ రీసర్వే, భూ భారతి అమలు, సాదాబైనా మా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు, రెండు పడక గదులు ఇళ్ల పంపిణీ, వి ద్యార్థుల యూనిఫాం పంపిణీ తదితర అంశా లపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స మీక్షించారు. హైదరా బాద్‌ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేకప్రఽధాన కా ర్యదర్శి లోకేష్‌ కుమార్‌, తెలంగాణ హౌసింగ్‌ కా ర్పొరేషన్‌ మేనేజింగ్‌ డై రెక్టర్‌ పి.గౌతమ్‌, సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ నుం చి కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ అరుణారెడ్డి, ఏడీ ల్యాండ్‌ సర్వే గిరిధర్‌ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భూ భారతి అమలు, భూ రీసర్వే పురోతి, సాదా బైనామ దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంత్రికి వివరించారు. ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన వ్యవధిలోనే అన్ని కా ర్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలి పారు. ఈ వీసీలో వివిధ శాఖల జిల్లా అధికా రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 11:32 PM