ప్రజాపాలనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:43 PM
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దాపూర్, కుప్పగండ్ల గ్రామాలలో ఆయన పర్యటించారు. పెద్దాపూర్‌లో నిర్మించిన ఇందిరా మహిళాశక్తి భవనం, ఇందిరమ్మ ఇళ్లు, కుప్పగండ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు కేశమళ్ల అనూష, మొక్తాల రమేష్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నామన్నారు. ప్రతీ పథకంలో మహిళల భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కేశమళ్ల అనూష, మొక్తాల రమేష్, ఉప సర్పంచ్‌లు ప్రసాద్‌చారి, పద్మ, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీవో సులోచన, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్యగౌడ్, మార్కెట్ డైరెక్టర్లు కేశమళ్ల కృష్ణ, రాజశేఖర్, నాయకులు వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, పూల్‌సింగ్, ఏఈలు సురేందర్‌రెడ్డి, పల్లవి, సర్పంచ్‌లు గన్యానాయక్, శ్రీనునాయక్, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.