kumaram bheem asifabad-‘పది’ లక్ష్యం.. వంద శాతం
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:35 PM
పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో ఈ సారి వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదో తరగతికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి కావస్తు న్నందున అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్న తాధికారులు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు.
- విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు
పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో ఈ సారి వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా విద్యాశాఖ యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పదో తరగతికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి కావస్తు న్నందున అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్న తాధికారులు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు.
కాగజ్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లా ముందంజలో ఉండేవిధంగా ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, జిల్లా యంత్రా గం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, వాటి పరీక్షల నిర్వహణ కొనసాగించాలని ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే వార్షిక పరీక్షలకు ముందుగా, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారు. వీటి నిర్వహణతో వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత పక్కా ప్రణాళికతో సన్నద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అధిక ఉత్తీర్ణత శాతం సాధించేలా సమాయత్తం చేయవచ్చు. ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు, పరీక్షలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు పరీక్షల విధానంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 15 కేజీబిబీ, రెండు మోడల్ స్కూల్స్, 60 హైస్కూల్స్‌లో 3,437 విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాల నుంచి సుమారు 3,000 మంది పరీక్ష రాయనున్నారని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ తెలిపారు.
- విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి కాగానే సమాధాన పత్రాలు వెంటనే మూల్యాంకనం చేయించేలా చూడాలని ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ నుంచి ఆదేశాలున్నాయి. అనంతరం విద్యార్థుల వారీగా ప్రోగ్రెస్ ఆధారంగా రివ్యూ చేసి వార్షిక పరీక్షలకు సిద్ధం చేసేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం అభ్యాసన దీపికలు, క్వశ్చన్ బ్యాంక్స్ పుస్తకాల ఆధారం గా శత శాతం ఫలితాలు సాధించేందుకు సిద్ధం చేస్తు న్నారు. ఎప్పటికప్పుడు పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు, ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులతో సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వీక్లీ-1 పరీక్షలు పూర్తి చేసి వీక్లీ-2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 89 శాతం ఫలితాల సాధిం చారు. ఈ ఏడాది మరింత మెరుగ్గా ఉండేలా ప్రతీ రోజు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను ఏ,బీ,సి గ్రూపుల వారీగా విభజించి చదివేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 24 వరకు వార్షిక పరీక్షల సబ్జెక్టుల వారీగా వరుసగా ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తూ జిల్లాను శత శాతం ఫలితాలు వచ్చే విధంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.