Share News

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే తపస్‌ ధ్యేయం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:44 PM

పాధ్యాయుల హక్కుల సాధన ప్ర భుత్వ విద్యారంగ పరిరక్షణే తమ ధ్యే యమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం (తపస్‌) రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు స్పష్టం చే శారు.

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే తపస్‌ ధ్యేయం
మాట్లాడుతున్న తపస్‌ నాయకుడు హనుమంతరావు

- తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు

కొల్లాపూర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల హక్కుల సాధన ప్ర భుత్వ విద్యారంగ పరిరక్షణే తమ ధ్యే యమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం (తపస్‌) రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు స్పష్టం చే శారు. ఆదివారం జిల్లాస్థాయి సంఘం కార్యని ర్వాహకవర్గ సమావేశం కొల్లాపూర్‌ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమశిలలో ఘ నంగా జరిగింది. ఆయన మాట్లాడుతూ ఉపా ధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తపస్‌ ఎమ్మెల్సీలు పలు మార్లు రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులను కలిసిని వేదికలు సమర్పిం చారని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. తపస్‌ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పెంటయ్య మాట్లాడుతూ కాం ట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని, వారిని తక్షణమే పాత పెన్షన్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, మన్నెమో ని శేఖర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్ట నరేంద ర్‌రెడ్డి, అరవింద్‌, రాజశేఖర్‌ రావు, నాగరాజుతో పాటు ఉమ్మడి నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివి ధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శు లు, ఉపాధ్యాయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:44 PM