Share News

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:38 PM

ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలను మెరు గుపరచడంతో పాటు ప్రతీ విద్యార్ధి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ సూచించారు.

విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం
జిల్లా కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకుంటున్న డీఈవో రమేశ్‌

- జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌ కుమార్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలను మెరు గుపరచడంతో పాటు ప్రతీ విద్యార్ధి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందిం చేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ సూచించారు. బుధ వారం నాగర్‌కర్నూల్‌, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠ శాలలు, కేజీబీవీలను డీఈవో ఆకస్మికంగా తని ఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజ రు, బోధన, పాఠశాల నిర్వహణ, అభ్యసనా స్థా యిలను పరిశీలించి విద్యార్థుల ప్రగతిపై నిరం తరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల భ ద్రత, సేకరణ, మూల్యాంకన ప్రక్రియపై అధికా రులను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదే శించారు. మధ్యాహ్న భోజన పథకం, విద్యా ర్థుల ఆరోగ్యం, వ్యక్తిగత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై కూడా డీఈవో పరిశీలించారు. డీఈవో వెంట ఇన్‌చార్జి జీసీడీవో నిర్మల, ఇన్‌చార్జి డీఎస్‌వో శైలజ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:38 PM