సమాజంలో ప్రశాంతతే లోక్ అదాలత్ లక్ష్యం
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:08 PM
సమాజంలో ప్రశాంతమైన వాతావరణం నెల కొల్పడమే లోక్ అదాలత్ లక్ష్య మని జిల్లా ప్రధాన న్యాయాధి కారి, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్ రమా కాంత్ అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి రమాకాంత్
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో ప్రశాంతమైన వాతావరణం నెల కొల్పడమే లోక్ అదాలత్ లక్ష్య మని జిల్లా ప్రధాన న్యాయాధి కారి, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్ రమా కాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దే శించి ఆయన మాట్లాడుతూ సమాజంలో కొంత మంది విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడు తూ కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నా రని పేర్కొన్నారు. సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రధాన న్యాయ స్థానం ఆదేశానుసారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించామన్నారు. కు టుంబ తగాదాలు, భూముల తగాదాలు తదిత ర కేసుల పరిష్కారం కోసం అనుభవ జ్ఞులైన న్యాయవాదులను నియమిస్తూ మీడియేషన్ కార్యక్రమం ద్వారా ఇరుపక్షాలను సంతృప్తి పరుస్తూ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం చేస్తున్నామనిపేర్కొన్నారు. కార్యక్రమంలో పోక్సో న్యాయమూర్తి నసీమా సుల్తానా, బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు రవికాంతారావు, సీనియన్ న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, కక్షిదారులు పాల్గొన్నారు.
607 కేసులు పరిష్కారం
కొల్లాపూర్, (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ జూని యర్ సివిల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు న్యాయాధికారులు దమ్ము ఉప నిషద్వాని, శరణ్య, స్పెషల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా వివిధ కేసుల్లో కక్షిదారుల మొత్తం 607 కేసులు పరిష్కారమయ్యాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసో సియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది కేశవ్ కుమార్, కోర్టు సిబ్బంది, వలంటీర్ మధుసూదన్ పాల్గొన్నారు.