ఇమ్యూనైజేషన్‌లో వంద శాతం లక్ష్యం సాధించాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:30 PM
జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి డాక్టర్ కృష్ణ మంగళవారం పదర, అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిం చారు.
- పదర పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
పదర/ బ్రహ్మగిరి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి డాక్టర్ కృష్ణ మంగళవారం పదర, అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిం చారు. పదరలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతీ విభాగాన్ని పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను, ఓపీ రిజిస్టర్లను పరిశీ లించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే సిబ్బందికి ప లు సూచనలు చేశారు. రెండు రోజులుగా కొన సాగుతున్న జాతీయ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రా మ్ ప్రగతిని ఆయన బూత్‌ల వారీగా సమీక్షిం చారు. పదర మండలంలో వందశాతం లక్ష్యాన్ని సాధించేలా క్షేత్రస్థాయి సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సురే ష్‌బాబు, డిప్యూటీ డెమో రాజగోపాలాచారి, డీవీ ఎల్‌ఎం కుమార్, పదర ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం వైద్యాధికారిని డాక్టర్ పావని, ఫార్మసీ ఆఫీ సర్, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకా ర్యకర్తలు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ బ్రహ్మగిరి, వటువర్లపల్లి గ్రామాలలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ పర్యటించి చిన్నా రులకు పోలియో చక్కల కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతున్నదా లేదా అని పరిశీలిం చారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పేద లకు మెరుగైప వైద్యం అందించేం దుకు వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్థించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ సురేష్‌బాబు, వటువర్లపల్లి పీహెచ్‌సీ డాక్టర్ అభిలాష్, డీవీఎల్‌ఎం కుమార్, డిప్యూటీ డెమో రాజగోపాలచారి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.