Share News

ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:37 PM

చెన్నూరును ఆధునిక పట్ట ణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్ర ణాళికలతో ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు.

ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరును ఆధునిక పట్ట ణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్ర ణాళికలతో ముందుకు సాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని పు ష్కరఘాట్‌ నిర్మాణానికి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి భూమి పూజ చేశా రు. మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెన్నూ రులో పుష్కరాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. 70 కోట్లతో పను లు చేపడుతున్నామన్నారు. సుమారు రూ. 8 కోట్లతో పుష్కరఘాట్‌లు, స్నా నపు గదులు, రహదారులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గోదా వరి రోడ్డుతో పాటు చెన్నూరు పట్టణంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతు న్నామన్నారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి చెన్నూరు వరకు సుమారు రూ. 5.50 కోట్లతో రోడ్డు విస్తరణ, లైటింగ్‌ పనులు చేపడుతున్నామన్నారు. రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన వారికి షాపులు కేటాయించేలా చర్యలు తీ సుకుంటున్నామన్నారు. పేదలు, చిరు వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా 1.20 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. చెన్నూరు పెద్ద చెరువును సుమారు రూ. 17 కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, శివ్వారం గోదావరి మొసళ్ల మడుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో నీటి పారుదల శాఖ అధికారి విష్ణు, మండల తహసీల్దార్‌ మల్లికా ర్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దిం టి పద్మ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:38 PM