Share News

kumaram bheem asifabad- మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:30 PM

మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. రెబ్బెన మండలంలోని నంబాలలో ఇంద్ర మహిళ శక్తి సమాఖ్య ఆధ్వర్యంలో రూ.6 కోట్ల రూపాయితో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా ప్రతి రోజు సుమారు పదివేల యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

kumaram bheem asifabad- మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
సోలార్‌ ప్లాంట్‌ వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ కె హరిత

రెబ్బెన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. రెబ్బెన మండలంలోని నంబాలలో ఇంద్ర మహిళ శక్తి సమాఖ్య ఆధ్వర్యంలో రూ.6 కోట్ల రూపాయితో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ద్వారా ప్రతి రోజు సుమారు పదివేల యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుంసదానం చేసి విక్రయిచడం ద్వారా యూనిట్‌కు 3.31 రూపాయిల చొప్పున ఆదాయం సమకూరుతుందన్నారు. మహిళ సంఘాల ఆధ్వర్యంలో భారీ సామార్థ్యం కలిగిన సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సంఘాల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. సోలార్‌ ప్యానెళ్లపై దుమ్ము, దూళి పేరుకకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. వాహనాలు సులభంగా చేరుకునే విధంగా రహదారికి అవసరమైన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని చెప్పారు. నిర్ధేశిత సామర్థ్యానికి అనుగుణంగా నిరంతర విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాంట్‌ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యనలు గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళా సమాఖ్యకు నిరంతర ఆదాయం సమకూరే విధంగా సబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం సోలార్‌ ప్యానెళ్లను, విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థను ప్లాంటు నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. కార్యక్రమంలో డీఆర్‌డీఏ దత్తారావు, విద్యుత్‌ ఎస్‌ఈ ఉత్తం జాడే, ఇంద్ర, గౌతమి, జంగుబాయి, తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండల సమాఖ్యలకు చెందిన మహిళా శక్తి సమాఖ్య సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

రెబ్బెన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. రెబ్బెనలో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలను పరిశీలించి, ఇంగ్లీషు, గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే మెరూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు, క్యాష్‌బుక్‌లను నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని గ్రామ కార్యదర్శికి ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 10:30 PM