Share News

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:38 AM

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే చేపట్టినట్లు ఎస్పీ మహేష్‌ బీగీతే తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజల సమస్యలను వింటున్న జిల్లా ఎస్పీ

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 27 (ఆంఽధ్రజ్యోతి): ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే చేపట్టినట్లు ఎస్పీ మహేష్‌ బీగీతే తెలిపారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భాధితుల నుంచి 36 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్‌ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు స్వీకరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్‌శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరిం త సమర్ధవంతంగా సేవలందించాలన్నారు. గ్రీవెన్స్‌ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని జిల్లాఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 28 , 2026 | 12:38 AM