kumaram bheem asifabad- సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:17 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని గాంధీ చౌక్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
కాగజ్‌నగర్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని గాంధీ చౌక్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యక్రమంతో వివిధ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అధికారులు అత్యవసర పనులపై ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సాయి, మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తానా, వైస్ చైర్ పర్సన్ అనిత, కమీషనర్ తిరుపతి, డీఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలరి ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాగజ్‌నగర్ పట్టణంలోని పిల్లల ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ షాహీన్ సుల్తానా మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ, ఇతర రంగాల్లో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు కౌన్సిలర్‌లు, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.