Share News

రైతును రాజుగా చూడటమే లక్ష్యం

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:48 AM

రైతు ను రాజుగా చూడడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమ ని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలం కొలనూ రు సింగిల్‌ విండో పాలకవర్గం అభినందన సభలో పాల్గొని, అనంతరం మరిమడ్ల గ్రామంలోని అంగన్‌ వాడీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు

రైతును రాజుగా చూడటమే లక్ష్యం
మాట్లాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి) : రైతు ను రాజుగా చూడడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమ ని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలం కొలనూ రు సింగిల్‌ విండో పాలకవర్గం అభినందన సభలో పాల్గొని, అనంతరం మరిమడ్ల గ్రామంలోని అంగన్‌ వాడీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన సేవలను అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి సింగిల్‌ విండో సహకార సంఘాలు వారధిగా నిలవాలని అన్నారు.వ్యవసాయ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, ఇతర వ్యవసాయ సంబంధిత వస్తువులు అందు బాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రైతన్నకు మేలు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతాంగానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధానం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే ప్రారంభమైందని, గుర్తు చేశారు.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయానికి అవసరమైన వనరులు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్‌ అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయ కత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు. గత పాలనలో అప్పుల భారం పెరిగిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ. 6 వేల కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు జలగం అరవిందరావు, కుల స్వాతి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ లు చేపూరి గంగాధర్‌, భాస్కర్‌ రావు, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, ఫిరోజ్‌ భాష పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:48 AM