kumaram bheem asifabad- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:54 PM
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అడె ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు
జైనూర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అడె ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పీఆర్టీయూటీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ, జీపీఎఫ్, టీస్‌జీఎల్‌ఐసీ, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు జూలై 2023 నుంచి రావాల్సిన వేతన సవరణల బకాయిలు విడుదల చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, డిప్యూటేషన్ల కారణంగా పలుచోట్ల హెచ్‌ఎంలు ఇన్‌చార్జీలుగా ఆదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. వారు బోధనతో పాటు వార్డెన్ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఆయా పాఠశాలల్లో వెంటనే సీఆర్టీలను నియమించాలని కోరారు. ఆశ్రమోన్నత పాఠశాలల్లో పీజీ హెచ్‌ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న చోట్ల అదనపు ఉపాధ్యాయులను నియమించాలని చెప్పారు. ప్రతీ హాస్టల్‌కు రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేజీబీవీలో పని చేస్తున్న ఉపాధ్యాయులతో వేసవి సెలవుల్లో పని చేయించుకుని, వారి వేతనాల్లో కోత విధించడం అన్యాయమని చెప్పారు. కేజీబీవీ సిబ్బందికి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న సీఆర్టీల వేతనాలు విడుదల చేయాలని కోరారు. వాటిని ప్రతీ నెలా ఒకటో తేదీన మంజూరు చేయాలని ఆయన కోరారు.