Share News

kumaram bheem asifabad- సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:50 PM

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోందని తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

kumaram bheem asifabad-  సమస్యల పరిష్కారమే ధ్యేయం
బెజ్జూరులో ప్రజావాణిలో పాల్గొన్న అధికారులు

బెజ్జూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోందని తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏవో నాగరాజు, వెటర్నరీ డాక్టర్‌ లక్ష్మినారాయణ, ఎఫ్‌ఎస్‌వో సాఫియాబేగం పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఉజ్వల్‌ కుమార్‌ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 15 మంది నంఉచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం, భూ సమస్యల కోసం దరఖాస్తులు వచ్చినట్టు ఎంపీడీవో తెలిపారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో 16 మంది దరఖాస్తులను స్వీకరించినట్టు ఎంపీడీవో కోట ప్రసాద్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, జూనియర్‌ కళాశాల సమస్య, సమాచార హక్కు చట్టంతో పాటు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 14 దరఖాస్తులు స్వీకరించినట్టు ఎంపీడీవో నస్రుల్లాఖాన్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, పెన్షన్‌ మంజూరుతో పాటు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 21 దరఖాస్తులు స్వీకరించినట్టు ఎంపీడీవో నగేష్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, పెన్షన్‌ మంజూరుతో పాటు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 10 దరఖాస్తులు స్వీకరించినట్టు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, పెన్షన్‌ మంజూరుతో పాటు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

కెరమెరిలో, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 18 మంది సమస్యలపై దరఖాస్తులు అందజేశారని ఎంపీడీవో అంజద్‌ పాషా తెలిపారు. ననూతన పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, పెన్షన్‌ మంజూరుతో పాటు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల క్రేందంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నలుగురు సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారని సూపరింటెండెంట్‌ మహేష్‌ తెలిపారు. నూతన పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, పెన్షన్‌ మంజూరు తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్‌ ఉప్పుల ప్రమోద్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

Updated Date - Aug 24 , 2026 | 10:50 PM