Share News

ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:39 PM

సింగరేణి ఓపెన్‌ కాస్టు గని తవ్వకాల కారణంగా ముంపు గురైన తాళ్లపల్లి, సింగపూర్‌, గుత్తే దారిపల్లి గ్రామాల పునరావాస కాలనీల్లో సమస్యలు పరిష్కరించడ మే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు

నస్పూర్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి ఓపెన్‌ కాస్టు గని తవ్వకాల కారణంగా ముంపు గురైన తాళ్లపల్లి, సింగపూర్‌, గుత్తే దారిపల్లి గ్రామాల పునరావాస కాలనీల్లో సమస్యలు పరిష్కరించడ మే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. న స్పూర్‌లోని 24, 25 డివిజన్లలోని పునరావాస కాలనీల్లో ఎమ్మెల్యే శనివారం శ్రీరాంపూర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, కార్పొ రేషన్‌ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యేకు నిర్వాసిత ప్రజలు సమస్యలను విన్నవించారు. తాళ్లపల్లి, సింగ పూర్‌, గుత్తేదారిపల్లిల్లో వీధి దీపాలు, డ్రైనేజీలు, దేవాలయాలు, బో ర్లు, దోబీఘాట్లు, రోడ్లు, ఫంక్షన్‌ హాల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రహారి గోడ లు, పాఠశాలల అభివృద్ది, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు త దితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను విన్న ఎమ్మెల్యే స మస్యలను సాధ్యమైనంతా త్వరగా పరిష్కారించాలని సింగరేణి అ ధికారులకు ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఎక్కడ కూ డా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసు కుంటా నని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ ధర్ని మధుకర్‌, డి ప్యూటి మేయర్‌ రమ్య, 24,25 డివిజన్ల కార్పోరేటర్లు బొ డ్డు స్వప్న, తోట రజిత, మున్సిపల్‌ కమీషనర్‌ అన్వేష్‌, కార్పోరేటర్లు ఎంబడి కు మారస్వామి, పుట్ట యశోద, సంపత్‌రెడ్డి, నాయకులు తోట శ్రీని వాస్‌, మర్రి రాజమౌళిలతో పాటు కార్పొరేషన్‌ అధికారులు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:39 PM