Share News

రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:50 PM

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు నీరు, నాణ్యమైన విద్యుత్‌, నాణ్యమైన విత్తనాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలం కొలనూరు సింగిల్‌ విండో పరిధిలోని సుద్దాల గ్రామంలో సింగిల్‌విండో గోదామును మంగళవారం ప్రారంభించి

రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
సుద్దాలలో గోదాంను ప్రారంభిస్తున్న ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు నీరు, నాణ్యమైన విద్యుత్‌, నాణ్యమైన విత్తనాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండలం కొలనూరు సింగిల్‌ విండో పరిధిలోని సుద్దాల గ్రామంలో సింగిల్‌విండో గోదామును మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. కోనరావుపేట మండ లంలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంద న్నారు. బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే రైతులు అక్కడ విక్రయించుకో వచ్చని, లేకపోతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గంలో 19 నూతన సబ్‌స్టేష న్లను మంజూరు చేసుకున్నామని తెలిపారు. అవసర మైన సందర్భాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.కోటి చొప్పున నిధులు అందుబా టులో ఉంచినట్లు వివరించారు. రాబోయే జనవరి నుంచి ఏప్రిల్‌, మే నెలల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేలా ప్రణా ళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌ చైర్మన్‌ తాళ్లపెళ్లి ప్రభాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్లు చేపూరి గంగాధర్‌, బొమ్మన భాస్కర్‌ రావు, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, ఫిరోజ్‌ పాషా, మండల అధ్యక్షుడు మానక సత్యం, కచ్చకా యల బాల్‌రెడ్డి, నాయిని ప్రభాకర్‌రెడ్డి, అవురం సురేష్‌, ఉప్పుల గంగయ్య, సంజీవ్‌, బొడ్డు రమేష్‌, సాసాల రాజిరెడ్డి, కర్రోళ్ల భాస్కర్‌, శ్రీనివాస్‌, సిద్దర వేణి ప్రభాకర్‌, సాయి, వంశీ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:50 PM