Share News

విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:46 PM

నియోజకవర్గాన్ని విద్యా, వైద్యంలో మొద టిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ప్రతీ విద్యార్థికి పౌష్టికాహారం అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యం
కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, జిల్లాకలెక్టర్‌ కుమార్‌దీపక్‌

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, ఆగస్టు31 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని విద్యా, వైద్యంలో మొద టిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ప్రతీ విద్యార్థికి పౌష్టికాహారం అందిం చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం కా లేజీరోడ్డులోని సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో పాటు డీసీపీ భాస్కర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరేక్రిష్ణ మెమోరియల్‌ చారిట్రబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న కేంద్రీకృత వంటశాలతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని 17 మండలాల ప రిధిలో 691 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, 13 ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతీ రోజు పోషక విలువలతో కూడిన పౌష్టికాహాన్ని అందిస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువుపై దృష్టి సారించి మంచి స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రవేశపెట్టి విద్యార్థులకు అ ల్ఫాహారం అందించి ఏకాగ్రతతో విద్యను అభ్యసించేందుకు చర్యలు తీసుకుంటుం ద న్నారు. సామాజిక భాద్యతలో భాగంగా సింగరేణి సంస్థ రూ.8కోట్లు సీఎంఆర్‌ నిధుల ను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం హరేక్రిష్ణ చారిట్రబుల్‌ ట్రస్టు ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీ కౌంతేయ దాస స్వామిజీ మాట్లాడుతూ సుమారు 50వేల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం సకాలం అల్పాహారం అందించేందుకు అక్ష యఫౌండేషన్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అన్వేష్‌, మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, నగర అధ్యక్షుడు తూముల నరేశ్‌, సింగరేణి సంస్థ అధికారులు బుద్ద ప్రకాశ్‌, రాధాక్రిష్ణ, చారిట్రబుల్‌ ప్రతినిధులు సత్య చంద్రదాస్‌, కాంతయ్య దాస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భానేష్‌, కార్పొరేటర్లు జ్యోతి, లక్ష్మి, పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:46 PM