Share News

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:29 PM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని మేయర్‌ ధర్ని మఽధుకర్‌ అ న్నారు. నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళికలో భాగంగా శనివారం స్పెషలిస్టు వైద్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనితతో కలిసి ప్రా రంభించారు.

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మేయర్‌, వైద్యాధికారులు

వైద్య శిబిరంలో మేయర్‌ మఽధుకర్‌

నస్పూర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని మేయర్‌ ధర్ని మఽధుకర్‌ అ న్నారు. నస్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళికలో భాగంగా శనివారం స్పెషలిస్టు వైద్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అనితతో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం అందిస్తున్న వైద్య సేవలను స్థానిక ప్రజలు సద్విని యో గం చేసుకోవాలన్నారు. కేంద్రంలో పని చేసే వైద్య బృందం సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూ చించారు. కార్పొరేటర్ల ద్వారా ఆరోగ్య కార్యకర్తలచే ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. జిల్లా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ ఇప్ప టి వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య నిపుణు లచే శిబిరాలను నిర్వహించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఉచితంగా 72 రకాల పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్స అందించి మం దులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వ్యాధులు ప్రబ లకుండా ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు. ఈ వైద్య శిబిరంలో డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, కార్పొరేటర్లు రా చకొండ గోపాల్‌రావు, ఎండీ ఖలీద్‌, సుదమల్ల హరిక్రిష్ణ, జిల్లా ప్ర భుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ వేద వ్యాస్‌, డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ వెంకటేశ్‌, సిహెచ్‌ఓలు కాకిరాల వెంకటేశ్వర్లు, ప్రశాంతి, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, ఆరోగ్య సిబ్బంది వెంకటేశ్‌, సునిల్‌, ఆయుశ్‌ వైద్యులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:29 PM