Share News

పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:54 PM

పేద ప్రజల సంక్షేమం, గూడు లేని అర్హత ఉన్ననిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి నీడ వసతి కల్పించడ మే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ప ర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు.

పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం
దేవునితిర్మలాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- దేవునితిర్మలాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి

పెద్దకొత్తపల్లి,జూలై5 (ఆంధ్రజ్యో తి) : పేద ప్రజల సంక్షేమం, గూడు లేని అర్హత ఉన్ననిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి నీడ వసతి కల్పించడ మే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ప ర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. ఆదివారం మండలంలో ని దేవుని తిర్మలాపూర్‌ గ్రామంలో లబ్ధిదారుల తో కలిసి ఇందిరమ్మ ఇంటి ప్రవేశం చేశారు. ల బ్ధిదారులకు ప్రభుత్వ కానుకగా నూతన పట్టు వస్త్రాలను మంత్రి అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను అధిక మొత్తంలో అప్పులు చేయకుండా కట్టుకో వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు వి.సత్యం, సర్పంచ్‌లు బారీ వాములు, మాజీ సర్పంచ్‌ పగడాల చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు డి.రవికుమార్‌, వెన్న చెర్ల గ్రామ ఉప సర్పంచ్‌ బైరాముడు, గృహ నిర్మాణ సంస్థ ఏఈ రాజేందర్‌రెడ్డి, పంచాయతీ సెక్రటరీ కృష్ణయ్య, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:54 PM