kumaram bheem asifabad- ఓటు హక్కును కాపాడడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:33 PM
ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో బుధవారం డీసీసీ అధ్యక్షురాలు లు ఆత్రం సుగుణ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి కార్యక్రమ కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో బుధవారం డీసీసీ అధ్యక్షురాలు లు ఆత్రం సుగుణ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి కార్యక్రమ కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నవంబరు 1న న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ’ఓట్ బచావో-దేశ్‌బచావో కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమం ప్రాధాన్యతను వివ రిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేసి ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు సంరక్షణ ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఓటరుకు ఓటు హక్కు దక్కేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ’ఓట్ బచావో-దేశ్‌బచావో‘ అభియాన్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయా లని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌అనిల్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు మంగ, దేవయ్య, మున్సిపల్ ప్లోర్ లీడర్ అబ్దుల్లా, జడ్పీ మాజీ చైర్మన్‌సిడాం గణపతి, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మురళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.