kumaram bheem asifabad- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ABN , Publish Date - Feb 27 , 2026 | 10:16 PM
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. కాగజ్‌నగర్‌లోశుక్రవారం ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ భవన్‌లో కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు, కాగజ్‌నగర్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లినర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. కాగజ్‌నగర్‌లోశుక్రవారం ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ భవన్‌లో కాగజ్‌నగర్ టౌన్ పోలీసులు, కాగజ్‌నగర్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లినర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన చూపు లోపాలను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవటం ఎంతగానో అవసరమని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అధిక వేగాన్ని నివారిస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ సీఐ ప్రేం కుమార్, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సై సుధాకర్, రాజు, ఏవీఎంఐ ఇన్స్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కాగజ్‌నగర్ పట్టణంలో ప్రజా భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కాగజ్‌నగర్ పోలీసులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన వాటిని ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ను ఎస్పీ అభినందించారు.