kumaram bheem asifabad-విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే ధ్యేయం
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:35 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణలను మరింత మెరుగు పర్చడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. జ్రిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి సందర్శించి విద్యా ప్లస్ యాప్ పనితీరును పరిశీలించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణలను మరింత మెరుగు పర్చడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. జ్రిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి సందర్శించి విద్యా ప్లస్ యాప్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అభ్యాసాన్ని అందించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న విద్యా ప్లస్ కార్యక్రమం విద్యార్థి కేంద్రిత, సాంకేతిక ఆధారిత బోధన విదానంతో ముందుకు సాగుతుందని అన్నారు. తరగతి గదిలో చివరి బెంచిలో కూర్చున్న విద్యార్థికి కూడా పాఠం పూర్తిగా అర్థం అయ్యేలా విద్యాప్లస్ యాప్‌ను రుపొందించామని చెప్పారు. విద్యార్థులు పూర్తిగా నేర్చుకునే వరకు బోధన కొనసాగడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిజిటల్ బోధనకు విద్యా ప్లస్ వేదికగా పనిచేస్తుందని వివరించారు. ఈ యాప్ ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలోని ఐఎఫ్‌టీ డిజిటల్ స్ర్కీన్ సహాయంతో పాఠాలను బోధిస్తారని అన్నారు. పాఠం ముగిసిన వెంటనే స్ర్కీన్‌పై బహుళైచ్చిక ప్రశ్నలు ప్రదర్శించ బడతాయని తెలిపారు. విద్యార్థులు తమవద్ద నున్న క్యూఅర్ కోడ్ బుక్ ద్వారా సరైన సమాధానాన్ని ఒకే సారి తరగతి గదిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వైపు చూపిస్తారని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ కెమెరాలు క్షణాల్లోనే విద్యార్థులందరికి సమాదానాలు స్కాన్‌చేసి ఫలితాలను అమలు చేస్తాయని వివరించారు. విద్యా ప్లస్ యాప్‌లో విద్యార్థులు ఆశించిన స్థాయిలో మార్కులు సాధించినపుడే తదుపరి అధ్యాయం అన్‌లాక్ అవుతుందని అన్నారు. ఒకవేళ మెజార్టీ విద్యా ర్థులు తక్కువ మార్కులు సాధిస్తే ఆ పాఠం వారికి పూర్తిగా అర్థం కాలేదని యాప్ గుర్తి స్తుందని చెప్పారు. అదే పాఠాన్ని ఉపాధ్యాయులు మళ్లీ బోదించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం, ఉపాధ్యాయుల బోధన ఎంతమేరకు చేరుతుందో సమర్థవం తంగా పర్యవేక్షించేందుకు విద్యా ప్లస్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించడంలో భాగంగా స్త్రీనిధి ద్వారా అందించిన రుణాల రికవరీలో పురోగతి సాధించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం సెర్ప్ డీపీఎం, ఏపీఎం, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించిన స్త్రీనిధి రుణాలను రికవరీ చేయడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. సంఘాలలో లక్ష మందికి పైగా మహిళ సభ్యులు ఉన్నారని చెప్పారు. ఇంకా 15వేల మంది నూతన సభ్యులను సంఘాలలో చేర్పించి బలోపేతం చేయాలని సూచించారు. సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి చేపల పెంపకం, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, పాడిగెదెల నిర్వహణ ద్వారా మరింత ఆదాయాన్ని సమకుర్చోకోవచ్చని తెలిపారు. ఏపీఎం, సీసీలకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తరావు తదితరులు పాల్గొన్నారు.