Share News

kumaram bheem asifabad- పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యం

ABN , Publish Date - Jan 22 , 2026 | 10:31 PM

కుమరం భీం జిల్లాలో 2023లో చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జైనూరు మండ లం జంగాం, బూసిమెట్ట, కెరమెరి మండలం మోడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన సభల్లో గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. అంతకు ముందు ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌, మహిళా సంఘాలకు రాయితీ రుణా లు, రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.

kumaram bheem asifabad- పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యం
జైనూరు మండలం బూసిమెట్ట గ్రామంలో ముఖాముఖిలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

- కృతజ్ఞతలు చెప్పడానికే జిల్లా పర్యటన

- గరిజనుల సమగ్ర అభివృద్ధికి చర్యలు

- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్‌/జైనూర్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో 2023లో చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జైనూరు మండ లం జంగాం, బూసిమెట్ట, కెరమెరి మండలం మోడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన సభల్లో గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. అంతకు ముందు ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసిడింగ్స్‌, మహిళా సంఘాలకు రాయితీ రుణా లు, రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమరం భీం జిల్లాలో 2023లో చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర సందర్భంగా ప్రజలు వ్యక్త పరిచిన సమస్యలను వివరంగా నమోదు చేసుకున్నానని అన్నారు. అవే సమస్యలకు సంబంధించిన అంశాలను బడ్జెట్‌లో పొందు పరిచి నిధులు కేటాయించి పరిష్కరిస్తున్నా మని చెప్పారు. తాను పాదయాత్ర చేసిన గ్రామా లు, ఇక్కడి వ్యక్తులను, సమస్యలను ఏ ఒక్కటీ మర్చిపోలేదన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడే విధంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్నేష నల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నా మని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఈ పాఠశాలల ను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. గిరిజనుల ఆభివృద్ధికి ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఉట్నూర్‌-ఆసిఫాబా ద్‌ రోడ్డు విస్తరణకు హమ్‌ పథకంలో నిధులు మంజూరు చేశామని అన్నారు. త్వరలోనే టెండర్లు పిలువనున్నామని తెలిపారు. కుమరంభీం ప్రాజెక్టు, అనార్‌పల్లి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఓజా తెగ హస్తకళల వృత్తికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తూ స్వయం ఉపాధి కింద గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్రలో భోజనం పెట్టి తనతో పాటు నడిచిన గంగుబాయి, లక్ష్మిబాయి కుటుంబాలను గుర్తు చేసుకున్నానని అన్నారు. వారిని హైదరాబాద్‌ ప్రజాభవన్‌కు భోజనానికి ఆహ్వానిస్తున్నానని, రాకపోకలకు అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయనాయక్‌, జీసీసీ ఛైర్మన్‌ కొట్నాక తిరుపతి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, విద్యుత్‌ శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్‌ , ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, డీఆర్డీవో పీ డీ బానోత్‌ దత్తారావ్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌, ఎంపీడీవో సుధాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ఆడ బీర్షావ్‌, సీఐ రమేశ్‌, ఎస్సై రవికుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకుద్‌, ఆత్మ చైర్మన్‌ రాథోడ్‌ రమేశ్‌, సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ, పెందుర్‌ ప్రకాష్‌. సర్పంచ్‌ పెందుర్‌ అనసూయ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

చూసిన మనిషిని.. ఊరును మరిచి పోలే

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ‘ఆ నాడు.. పాదయాత్ర సందర్భంగా మోడి, ఝరి గ్రామానికి చేరుకుని ఆ రోజు ఉగాది పండగ మూడు రోజుల పాటు ఇక్కడే ఉన్నాను... ఏరువాక సందర్భంగా వెంకట్రావు పొలంలో అరకదున్నాను.. ఎద్దులకు బెల్లం, కొబ్బరి తినిపించాను.. ఆ తరువాత లక్ష్మణరావు పటేల్‌ ఇంట్లో అందరం కలిసి గుగ్గిల్లి తిన్నాం.. ఆ తరువాత భోజనం చేశాం.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం కెరమెరి మండలం మోడి, ఝరి బహిరంగ సభలో గుర్తు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా కెరమెరి మండలం మోడిలో ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను పాదయాతర చేసిన గ్రామాలు, మనుషులు, సమస్యలు ఏ ఒక్కటీ మరి చి పోలేదని తెలిపారు. గతంలో మాదిరిగా ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.17 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళలు బట్టలు కొనుగోలుకు పడే ఇబ్బందులను గుర్తించి నాణ్యమైన చీరలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. దొడ్డు బియ్యం పురుగులతో ఉన్నాయని ఆ నాడు సమస్య వివరించగా ప్రజా ప్రభుత్వంలో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కూడా ఆ నాడు ప్రజలు చెపిప సమస్యలకు సమా దానాలు అని గుర్తు చేశారు. బడ్జెట్‌ పెట్టేటప్పుడు ప్రతి అంశం ఉండేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఏఎంసీ చైర్మన్‌ మంగ, నాయకులు మునీర్‌ అహ్మద్‌, శ్యాంనాయక్‌, కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, ఎస్పీ నితికా పంత్‌, ట్రాన్సుకో సీఎండీ వరుణ్‌రెడ్డి, డీపీవో భిక్షపతిగౌడ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 10:31 PM