kumaram bheem asifabad- విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం
ABN , Publish Date - Nov 22 , 2026 | 09:52 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యమని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. . జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్‌తో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ విద్యా పరిశోధన సంస్థలను మూడు రోజుల పాటు సందర్శించారు.
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యమని డీఈవో సచ్చిదానందచారి అన్నారు. . జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్‌తో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ విద్యా పరిశోధన సంస్థలను మూడు రోజుల పాటు సందర్శించారు. ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి విద్యా విధానంలో నూతన మార్పులకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విద్య ప్రమాణాల పెంపు, ఆధునిక బోధన పద్ధతు ల అమలు, పాఠశాలల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా జిల్లాలోని 18 మంది పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నవంబరు 19 నుంచి నవంబరు 21 వరకు పర్యటన సాగినట్టు తెలిపారు. పర్యటనలో భాగమైన మైసూరులోని రీజినల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంటు సంస్థలను సందర్శించారని చెప్పారు. ఆయా సంస్థల విద్యా విధానాలను, నూతన ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలు నాణ్యమైన విద్యను అందించేందుకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై అవగాహన పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.