Share News

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:01 PM

మాల ఉద్యో గుల సంక్షేమ సంఘం 2026 సం వత్సరం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆవిష్కరిం చారు.

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కేంద్రంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : మాల ఉద్యో గుల సంక్షేమ సంఘం 2026 సం వత్సరం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆవిష్కరిం చారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసిన మాల ఉద్యోగుల సంక్షే మ సంఘం నాయకులు క్యాలెండర్‌ ను ఆవిష్కరింపజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండవర్గాల సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మాజీ కౌన్సిలర్‌ జక్కా రాజ్‌కుమార్‌, మాల ఉ ద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు గోవర్ధన్‌, వెంకటపతి, కోశాధికారి కోటేశ్వ ర్‌, సభ్యులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బిజినే పల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన పలు వురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణా రావు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:01 PM