Share News

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:49 PM

మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కలె క్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం
ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- మాచినేనిపల్లి శివారులో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

కొల్లాపూర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కలె క్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. కొ ల్లాపూర్‌ నియోజకవర్గంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ స్థలా న్ని కలెక్టర్‌ మంగళవారం ఉదయం పరిశీలిం చారు. మండలంలోని మాచినేనిపల్లి గ్రామ శి వారులోని సర్వే నెంబర్‌ 119లో అందుబాటులో ఉన్న సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, ఐకేపీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్లాంట్‌ నిర్మాణానికి ఈ స్థలం ఎంత వరకు అనుకూలంగా ఉంటుందనే అం శంపై సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా చ ర్చించారు. ప్లాంట్‌ నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక కోణాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పూర్తి వి వరాలు అందజేయాలని సూచించారు. మహిళా సంఘాల నిర్వహణలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం ద్వారా వారికి స్థిరమైన రాబ డి సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్‌ ఆర్డీవో బన్సీలాల్‌, ఎంపీడీవో అడుసు మల్లి వెంకట్రావు, ఐకేపీ ఏపీవో అరుణ, రెవెన్యూ ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.

þ

Updated Date - Aug 18 , 2026 | 11:49 PM