కల్వకుర్తి సమగ్ర అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:29 PM
కల్వకు ర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : కల్వకు ర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవా లని ఆయన కోరారు. శుక్రవారం కల్వకుర్తి పట్ట ణ పరిధిలోని సిలార్‌పల్లి, తిమ్మరాసిపల్లి గ్రామా ల్లో రూ.3కోట్లతో నిర్మించే 33/11కేవీ సబ్‌స్టేషన్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనచేశారు. పట్టణం లోని రెండవ వార్డులో రూ.50లక్షలతో డ్రైనేజీ ని ర్మాణం, బాలరామ్‌నగర్ కాలనీలో రూ.2కోట్ల 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, మహ బూబ్‌నగర్ చౌరస్తా నుంచి శివాజీ చౌరస్తా వర కు రూ.2కోట్లతో చేపట్టే రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు, పాత ఇరిగే షన్ కార్యాలయాల్లో రూ.4 కోట్లతో నిర్మించే (56) షాపింగ్ కాంప్లెక్స్ నిర్మా ణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంత రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు ప్రొసీడింగ్‌లు అందజే శారు. నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్ర మంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్, కల్వ కుర్తి మాజీసర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, క మిషనర్ మహమ్మద్‌షేక్, ఎస్‌ఈ వెంకటనర సింహారెడ్డి, ఏడీఈ శంకరయ్య, ఏఈ శ్రీనివాస్ నాయక్, మాజీ జడ్పీటీసీ అశోక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, నాయకులు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, కాయితీ విజయ్‌కుమార్ రెడ్డి, జమ్ముల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.