ఉత్తమ ఫలితాలే లక్ష్యం
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:06 AM
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. 2027 మార్చి, ఏప్రిల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా
జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. 2027 మార్చి, ఏప్రిల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.19 లక్షల నిధులు కేటాయించింది.
ఫజిల్లాలో 6,544 మంది విద్యార్థులు
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు గురుకులాల్లో 6,544 మంది ప్రభుత్వ విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరికి ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతుల సమయంలో స్నాక్స్ అందించాల్సి ఉంటుంది. పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అదనపు సమయం చదువుపై కేటాయించేలా ఈ కార్యక్రమం దోహదపడనుంది. ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు పునఃశ్చరణ చేయించనున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో రాము ప్రత్యేక పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సమష్టి కృషితో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఫనిధుల విడుదలకు ఆదేశాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనుండగా జిల్లాకు రూ. 44.17 లక్షలు కేటాయించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. 45 రోజుల పాటు నిర్ణీత మెనూ ప్రకారం అల్పాహారం అందించాలని, కార్యక్రమం పూర్తయిన అనంతరం నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అల్పాహారం అందించడం ద్వారా సాయంత్రం ప్రత్యేక తరగతులపై ఆసక్తి పెరగడంతో పాటు పదో తరగతి పరీక్షలకు మెరుగైన సన్నద్ధతకు అవకాశం కలగనుంది.
ఫ45 రోజుల పాటు అల్పాహారం..
రాష్ట్ర సమగ్ర శిక్ష, పీఎంశ్రీ పథకాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 45రోజుల పాటు ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫఆరు రకాల స్నాక్స్...
విద్యార్థులకు ఉడికించిన పెసర్లు, పల్లీలు, బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు, ఉడికించిన బబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడికించిన శనగలు అందించనున్నారు. వారానికి ఆరు రకాల అల్పాహార పదార్థాలను మెనూలో చేర్చారు. నిర్ణీత యూనిట్ ధర పరిధిలో వీటిని అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వంద శాతం ఫలితాలే లక్ష్యం..
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
వచ్చే యేడాది జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణ సాధించడంతో పాటు రాష్ట్రంలోనే జిల్లాను అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాం. ఇందులో భాగంగా పూర్తయిన సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులతో నిరంతరం రివిజన చేయిస్తున్నాము. పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలి..? ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి..? సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి..? అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం.
జిల్లాలో ఎస్సెస్సీ విద్యార్థుల వివరాలు..
--------------------------------------------------------------------
మేనేజ్మెంట్ - బాలురు - బాలికలు - మొత్తం
ప్రభుత్వ - 207 - 281 - 488
జడ్పీ - 2,599 - 2,273 - 4,872
టీజీఎంఎస్ - 545 - 639 - 1,184
--------------------------------------------------------------------
మొత్తం - 3,351 - 3,193 - 6,544
--------------------------------------------------------------------