ప్లాస్టిక్ రహిత అడవులే లక్ష్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:29 PM
ప్లా స్టిక్ వాడకం తగ్గిదాం పచ్చదనాన్ని పెంచు దాం అనే నినాదంతో వన్యప్రాణి వారోత్సవా ల్లో భాగంగా ఆదివారం ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ వ్య ర్థాల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించా రు.
అడవుల్లో ప్లాస్టిక్ బాటిళ్లు తొలగింపు
దండేపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్లా స్టిక్ వాడకం తగ్గిదాం పచ్చదనాన్ని పెంచు దాం అనే నినాదంతో వన్యప్రాణి వారోత్సవా ల్లో భాగంగా ఆదివారం ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ వ్య ర్థాల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించా రు. కవ్వాల్ టైగర్ రిజ్వర్ ఫారెస్ట్‌లో దండేపల్లి మం డలం తాళ్లపేట అటవీ రెంజ్ పరిధిలో అడవి ప్రాంతంలోని అధికారులు, సిబ్బంది ప్లాస్టిక్ వ్య ర్థాలను తొలగించారు. అడవుల్లో పడేసిన ప్లా స్టిక్ బాటిళ్లు, సీసాలు, కవర్లు, ఇతర వ్యర్థాలను సిబ్బంది సేకరించి వాటిని తొలగించారు. ఎఫ్ ఆర్‌వో వికాస్ మాట్లాడుతూ అడవి ప్రాంతాల్లో పర్యటించే వారు ప్లాస్టిక్ బాటిళ్లు సీసాలు, కవ ర్లు తినుబండారాలు వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని సూచించారు. ఇవి అడ వుల పర్యావరణానికి వన్యప్రాణాలకు హానిక రంగా మారే ప్రమాదం ఉందన్నారు. అడవి దారిలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్లాస్టిక్ వ్యర్థాలను తమ వెంట తీసుకెళ్లి నిర్థేశిత ప్రదేశాల్లో వేయాలన్నారు. ప్లా స్టిక్ రహిత సమాజం-మన బాధ్యత అనే సం దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామన్నారు. అడవులను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణతో పా టు పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ త మ వంతు సహాకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎస్ సాగరిక, ఎఫ్‌ఎస్‌వోలు నరేష్, భగవంతరావు, ఎఫ్‌బివో లు రహిమ్మోద్దీన్, పద్మజ, అనిత, నాగేంద్ర, కృ ష్ణమూర్తి, కృష్ణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.