Share News

kumaram bheem asifabad-లక్ష్యం వంద శాతం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:04 PM

గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన పన్నుల వసూళ్లపై అధికారు లు దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పంచాయతీ సిబ్బంది ముందుకు వెళుతున్నారు.

kumaram bheem asifabad-లక్ష్యం వంద శాతం
వాంకిడి పంచాయతీ కార్యాలయం

- జిల్లాలో ఇప్పటి వరకు 74 శాతం వసూలు

- నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ

గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన పన్నుల వసూళ్లపై అధికారు లు దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పంచాయతీ సిబ్బంది ముందుకు వెళుతున్నారు.

ఆసిఫాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నులు వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. మండల పంచాయతీ అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలలో మొత్తం 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 74 శాతం పన్నులు వసూలయ్యాయి. మిగితా 26 శాతం ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ ఆస్తి పన్నులను చెల్లించేందుకు కొందరు స్వచ్ఛందగా ముందుకు వస్తుండగా మరి కొందరు ఇంటికి వెళ్లిఅడిగితే కానీ చెల్లించడంలేదు. పంచాయతీల్లో ఆస్తి పన్నుల వసూళ్లలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.

- సిబ్బంది ప్రత్యేక చర్యలు

వందశాతం పన్నులు వసూలు చేసేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 15 మండలాలలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా పంచా యతీల పరిధిలో ఇంటి పన్నులు,వాణిజ్య పన్నులు, మంచినీటి బిల్లుల వసూళ్లు వంద శాతం సాధించేలా అధికారులు ఒత్తిడి పెంచారు. దీంతో గ్రామల్లో పన్నుల వసూళ్ల కోసం నిరంతరాయంగా స్పెషల్‌డ్రెవ్‌ చేపడుతున్నారు, జిల్లాలో రూ.6,05,24,700 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.4,46, 84,124 వసూలయ్యాయి. రూ.1,58,40,576 పన్నులను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

- మండలాల వారీగా ఇలా..

ఆసిఫాబాద్‌ మండలంలో 27 పంచాయతీలలో ఇంకా మొత్తం రూ.7.95 లక్షలు వసూ లు కావాల్సి ఉంది. బెజ్జూర్‌లో 22 పంచాయతీలలో రూ.12.54 లక్షలు, చింతలమానేపలి ్లలో 19 పంచాయతీలలో రూ.9.05 లక్షలు బకాయిలు ఉన్నాయి. దహెగాంలో 24 పంచాయతీలలో రూ.5.39 లక్షలు, జైనూర్‌లో 26 పంచాయతీలలో రూ. 14.85 లక్షలు, కాగజ్‌నగర్‌లోని 28 పంచాయతీలలో రూ. 12.25 లక్షలు మేర వసూళు కావల్సి ఉంది. కెరమెరిలోని 31 పంచాయతీలలో రూ.6.17 లక్షలు, కౌటాలలోని 20 పంచాయతీలలో రూ.6.73 లక్షలు , లింగాపూర్‌లోని 14 పంచాయతీలలో రూ. 3.33 లక్షలు , పెంచిక ల్‌పేటలోని 12 పంచాయతీలలో రూ.2.44 లక్షలు మేర బకాయిలు ఉన్నాయి. రెబ్బెనలోని 24 పంచాయతీలలో రూ.25.83 లక్షలు , సిర్పూర్‌-టీలోని 16 పంచాయతీ లలో రూ.9.12 లక్షలు , సిర్పూర్‌-యూలోని 15 పంచాయతీలలో రూ.2.56 లక్షలు , తిర్యానిలోని 29 పంచాయతీలలో రూ.13.22 లక్షలు, వాంకిడిలోని 28 పంచాయతీలలో రూ.26.92 లక్షలు మొత్తం 15 మండలాలలోని 335 గ్రామ పంచాయతీలలో ఇంకా రూ.1,58,40,576 పన్నులు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులను వసూళ్ళు చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

గడుపులోగా పూర్తి చేస్తాం..

- భిక్షపతిగౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారి

గడువులోగా వందశాతం పన్నులు వసూళ్ల చేస్తాం. జిల్లాలోని 15 మండలాలలోని 335 గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే మండల పంచాయతీ అధికారులతో పాటు,గ్రామ కార్యదర్శులు తగిన సూచనలు ఇచ్చాం. ఈ నెలాఖరు వరకు 100 శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గడువులోగా లక్ష్యం చేరుకునేందుకు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:04 PM