లక్ష్యం ఘనం...ఆచరణలో జాప్యం..!
ABN , Publish Date - May 10 , 2026 | 12:32 AM
వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం కారణం గా అన్నదాతకు ఎనలేని నష్టం వాటిళ్లుతోంది. రబీ సీజన్ లో ధాన్యం దిగుబడి అంచనా వేసిన పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఘ నమైన లక్ష్యం పెట్టుకుంది.
-నత్తనడకన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-వరి కోతలు పూర్తయినా...తెరుచుకోని సెంటర్లు
-రోజుల తరబడి కల్లాలలో మూలుగుతున్న ధాన్యం
-అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం
మంచిర్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం కారణం గా అన్నదాతకు ఎనలేని నష్టం వాటిళ్లుతోంది. రబీ సీజన్ లో ధాన్యం దిగుబడి అంచనా వేసిన పౌర సరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఘ నమైన లక్ష్యం పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యాన్ని ఆచర ణలో పెట్టడంలో మాత్రం తీవ్ర నిర్లిప్తతను ప్రదర్శిస్తుం డటంతో జిల్లా యంత్రాంగం అబాసుపాలు కాక తప్ప డం లేదు. జిల్లాలో రబీ సీజన్‌లో ఒక లక్షా 18 వేల 437 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 2లక్షల 95వేల 759 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడి అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 319 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరస రఫరాలశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా లో వరికి సంబంధించి ఎక్కడో కొన్ని చోట్ల మినహా దా దాపుగా కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్ప టికీ ఇంకా సెంటర్లు ప్రారంభిస్తూనే పోతున్నారు. వరి కోత లు ప్రారంభం కాగానే లక్ష్యం మేరకు కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి ఉంటే, అకాల వర్షాల కారణం గా రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేదికా దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సెంట ర్లు ఏర్పాటు చేసిన చోట కూడా కొనుగోళ్లు ఆలస్యంగా చేపట్టారు. పై కారణాల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లినట్లయింది. తడిచిన ధాన్యం కూడా కొం టామ ని అధికారులు ప్రకటిస్తుండగా, ఈ నెల 5వ తేదీ న అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి వరదల్లో కొట్టుకు పో యి, బురదమైన వడ్ల పరిస్థితి ఏంటని పలువురు రై తులు ప్రశ్నిస్తున్నారు. అదే సకాలంలో కేంద్రాలు తెరి చి, కొనుగోళ్లు ప్రారంభించి ఉంటే తమకు ఈ దుస్థితి ఉండేది కాదని ఆవేదన చెందుతున్నారు.
నిల్వ వసతులు లేక జాప్యం....?
జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరియైన వసతులు లేని కారణంగానే కొనుగోళ్లు ఆల స్యంగా చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగో లు సెంటర్ల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో నిల్వ చేస్తారు. అయితే సీజన్‌లో ధాన్యం దిగుబడికి సరిపడా రైస్ మిల్లులకు జియో ట్యాగింగ్ ఇవ్వకపోవ డం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. జిల్లాలో మొత్తం 54 రైస్ మిల్లులు ఉండ గా, వాటిలో బాయిల్డ్-19, రా రైస్ మిల్లులు 35 ఉన్నా యి. వాటిలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అనుమ తులు 32 మిల్లులకు ఉన్నాయి. గతంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్నాయంటూ వాటిలో సింహభాగం మిల్లు లకు ఈ సీజన్‌లో జియో ట్యాగింగ్ ఇవ్వలేదు. సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది రైస్ మిల్లులకే జియో ట్యాగింగ్ ఇవ్వగా, అందులో బాయిల్డ్-07 మి ల్లులు, రామిల్ -01 ఉంది. ఆ ఎనిమిది మిల్లుల సా మర్థ్యం కేవలం 46 వేల మెట్రిక్ టన్నులేని అంచనా. ఇవిపోను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో అక్కడి రైస్ మిల్లులను జిల్లాకు కేటాయిస్తూ50వేల మెట్రిక్ టన్నుల చొప్పున జియో ట్యాగింగ్ ఇచ్చారు. ఈ మూడు జి ల్లాల్లో కలిపి మొత్తంగా లక్షా 50వేల మెట్రిక్ టన్నుల కంటే మించదు. జిల్లాలోని గోదాముల్లో ఽమరో మూడు వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. జిల్లాలో ఇంచు మించు రెండు లక్షల పై చిలు కు మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చినా.....మిగతా ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలో తెలియక కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించారనే అపవాదు ఉంది. పైగా ఇతర జిల్లా ల్లో జియో ట్యాగింగ్ ఇచ్చిన కొన్ని మిల్లులు స్థానికంగా ఉన్న మిల్లుల సీఎంఆర్ బకాయిలకంటే అధికంగా ఉ న్నప్పటికీ వాటికి పౌర సరఫరాలశాఖ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. పైగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు జియో ట్యాగింగ్ ఇవ్వడం వల్ల రవాణాలో ఆలస్యం జరిగి సకాలంలో కొనుగోళ్లు జరుగక కూడా రైతులకు నష్టం వాటిళ్లుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
భారంగా మారుతున్న మిల్లుల నిర్వహణ...
జియో ట్యాగింగ్ ఇవ్వని కారణంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో రైస్ మిల్లులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో నిర్వహణ భారానికి గురవుతున్నట్లు మిల్లర్లు వా పోతున్నారు. ఒక్కో మిల్లులో సగటున 60 మంది వ రకు హమాలీలు, గుమాస్తాలు, ఇతర సిబ్బంది పని చేస్తారు. వారందరూ పనిలేక ఖాళీగా కూర్చోవలసి వస్తుండగా, మిల్లుల నిర్మాణానికి బ్యాంకు రుణాలు తీసుకున్నందున ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉ న్నాయని వాపోతున్నారు. కనీసం కరెంటు బిల్లులు కూ డా కట్టలేని పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది లా ఉండగా సీఎంఆర్ బకాయిలున్న రైస్ మిల్లర్లకు ప్రభుత్వం 90 రోజులు గడువు విధిస్తూ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన జీఓఎంఎస్ నెంబర్ 07ను జారీ చేసిం ది. నిర్ణీత గడువులోగా డిఫాల్టర్లు క్వింటాలుకు రూ. 2237 చొప్పున చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షంలో 25 శాతం అపరాద రుసుంతో కలిపి క్వింటాకు రూ. 2442 వసూలు చేయాలని జీవోలో పేర్కొంది. అలాగే డిఫాల్టర్లపై చట్టపర చర్యలు సైతం తీసుకోవాలనే ఆదే శాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అంది వచ్చిన అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మిల్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన గడువును ధృష్టిలో ఉంచుకునైనా జిల్లాలోని మిల్లులకు జియో ట్యాగింగ్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన ధాన్యం లిఫ్ట్ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేప ట్టాలనే విజ్ఞాపణలు వినిపిస్తున్నాయి.