kumaram bheem asifabad- సమగ్రాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:40 PM
రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజాపాలన కొనసాగు తుందని దీనిలో భాగంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించే దిశగా ముందుకు సాగుతున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కె.హరిత అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా ఎస్పీ నితికాపంత్, జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్‌లు డేవిడ్, యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, అదనపు ఎస్సీ చిత్తరంజన్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి కలెక్టరేట్‌కు చేరుకొని పోలీసుల గౌరవ వందనం అనంతరం జెండా ఆవిష్కరించారు.
- తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
ఆసిఫాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజాపాలన కొనసాగు తుందని దీనిలో భాగంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించే దిశగా ముందుకు సాగుతున్నట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కె.హరిత అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా ఎస్పీ నితికాపంత్, జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్‌లు డేవిడ్, యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, అదనపు ఎస్సీ చిత్తరంజన్‌లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి కలెక్టరేట్‌కు చేరుకొని పోలీసుల గౌరవ వందనం అనంతరం జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. పారిశుధ్యం, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి సంక్షేమం లాంటి పథకాలలో 99 రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. మహిళలకు ఉచితంగా ఇచ్చే బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఇందరిమ్మ ఇళ్ల పథకంలో జిల్లాకు 8772 ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఇందులో 428 ఇళ్లు పూర్తయ్యాయని వివరిం చారు. మిగితావి త్వరలోనే పూర్తవుతాయన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న తరుణంలో రైతు భరోసా, రైతు బీమా పథకం లాంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఇతరులపై ఆధార పడే వారికి తీసుకు వచ్చిన చేయూత పథకంలో భాగంగా జిల్లాలో 53,745 మందికి వివిధ రకాల పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో 1,368 స్వయం సహాయక సంఘాలకు 100 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.
విద్య పరంగా అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, మైనార్టీ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమా లు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆర్థిక పునరావాసం కింద అన్ని వర్గాల దివ్యాంగులకు 20 మందికి ఆర్థిక పునరావాసం కింద అన్ని వర్గాల దివ్యాంగులకు 20 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. జిల్లాలో 6000 మంది వృద్దులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఇది ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుందన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,66,000 మందికి పరీక్షలు చేయబడ్డాయన్నారు. ఆరోగ్యం మహిళా పథకం ద్వారా అనారోగ్యంగా ఉన్న మహి ళలను గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. అనారోగ్య వృద్దుల కోసం పాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో 2232 మంది గుర్తించబడ్డారన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం జిల్లాలో 136 చెరువులు, రిజర్వాయర్లలో 1.9 కోట్ల చేప పిల్లల విడుదల చేయగా 23.94 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని అమలు చేయడంతో పాటు నేర నివారణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలి పారు. ప్రజాపాలనలో అందరిని కలుపుకుని అభివృద్ధి వైపు సాగుతున్నట్లు వివరించారు. కాగా వేసవి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలు గంటలోనే ముగిశాయి. 7.,45 గంటలకు అమర వీరుల స్తూపం వద్ద నివాళితో ప్రారంభమైన వేడుకలు గంట పాటు సాగాయి. పాఠశాలలకు సెలువు కావడంతో కేవలం అధికారులు మాత్రమే వేడుకల్లో కనిపించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రాశస్తిని తెలిపే విధంగా చేసిన పలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. మోక్షిత డ్యాన్స్ అకాడమీ పిల్లలతో పాటు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మాన్యవి చేసిన సాంప్రదాయ నృత్యం, కేజీబీవీకి చెందిన మహేశ్వరి తలపై దీపం పెట్టుకుని చేసిన యోగ నృత్యం, సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థిని సాన్విక చేసిన సాంప్రదాయ నృత్యంతో పాటు సాసం్కృతిక కళాకారులు పాడిన పాట అలరించాయి. అనంతరం ముఖ్య అతిథులు నృత్యాలు చేసి న విద్యార్థులను అభినందించారు. ఇందులో మహేశ్వరి అనే అమ్మాయిని ప్రత్యే కంగా అభినందిచారు. ఆమె నృ త్యానికి ప్రేక్షకులు సైతం చప్పట్లు కొట్టారు.