kumaram bheem asifabad- సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:33 PM
సింగరేణిలో గురువారం నిర్వహించే సార్వత్రి క సమ్మేను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రీజియన్ ప్రసిడెంట్ ఉపేందర్ పిలుపునిచ్చారు. స్థానికంగా మంగళవారం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
రెబ్బెన, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో గురువారం నిర్వహించే సార్వత్రి క సమ్మేను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రీజియన్ ప్రసిడెంట్ ఉపేందర్ పిలుపునిచ్చారు. స్థానికంగా మంగళవారం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, లక్ష్మినారాయణ, వెంకటేష్, కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నా రు. ఏఐటీయూఐసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వ ర్యంలో సీహెచ్‌పీ, ఇతర కార్యాలయ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తిరుపతి, మొగిలి, రాజేష్, శ్రీనివాస్, రామయ్య, శ్రీను, శ్రీనివాస్, శ్రీకాంత్, ఆర్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. స్థానిక పీహెచ్‌సీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ రశికకు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ప్రమీల, సునీత, వనిత, తులసీ, విజయలక్ష్మి, సరిత, రేణుక, సుప్రియ, మీనా పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్త సార్వత్విక సమ్మెకు టీఎస్‌యూటీ ఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంతికుమారి, ఊశన్న అన్నారు. స్థానికంగా మంగళవారం వారు మాట్లాడుతూ దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్ (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ కోరారు. స్థానికంగా మంగళవారం ఆయన మాట్లాడారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లను అమల్లోకి తెస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇబ్బందులు కలిగించే సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు త్రివేణి, శంకర్, కృష్ణమాచారి, పద్మ, శ్రీకాంత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.