Share News

kumaram bheem asifabad- గణేశుడి ఘట్టం.. వ్యక్తిత్వ పాఠం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:39 PM

వినా యక చవితి నవరాత్రోత్సవాలు.. పండుగ మాత్రమే కాదు. జీవితాన్ని తీర్చిదిద్దు కోవడానికి అవసరమ య్యే నైపుణ్యాలు ఈ వేడుకలో ఇమిడి ఉన్నాయి. ఉత్సవాల నిర్వహణ మొదలయ్యే. చర్చల నుంచి నిమజ్జం వరకు ఒక్కో ఘట్టం జీవితంలో నేర్చుకోవా ల్సిన ఎన్నో విలువైన అంశాలను నేర్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయక చవితి.. ఓ వ్యక్తిత్వ వికాస పాఠం

kumaram bheem asifabad- గణేశుడి ఘట్టం.. వ్యక్తిత్వ పాఠం
లోగో

వాంకిడి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వినా యక చవితి నవరాత్రోత్సవాలు.. పండుగ మాత్రమే కాదు. జీవితాన్ని తీర్చిదిద్దు కోవడానికి అవసరమ య్యే నైపుణ్యాలు ఈ వేడుకలో ఇమిడి ఉన్నాయి. ఉత్సవాల నిర్వహణ మొదలయ్యే. చర్చల నుంచి నిమజ్జం వరకు ఒక్కో ఘట్టం జీవితంలో నేర్చుకోవా ల్సిన ఎన్నో విలువైన అంశాలను నేర్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయక చవితి.. ఓ వ్యక్తిత్వ వికాస పాఠం.. జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న వేళ ప్రధాన మైన తొమ్మిది అంశాల గురించి తెలుసుకుం దాం...

- సవాళ్లు.. చర్చలు

వినాయక నవరాత్రోత్సవాల ఘట్టానికి తొలి మెట్టు.. సమావేశాల నిర్వహణ, ఉత్సవాలు ఎలా నిర్వహించాలి? ఎలాంటి ఆటంకాలు ఎదురవు తాయి ? అవరోధాలు ఎలా అధిగమించాలి ? దితర అంశాలను చర్చిస్తారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను, విద్యార్థులు కేరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తు అధిగ మించవచ్చు. బృంద చర్చలు ఎన్నో సమస్య లు, సవాళ్లకు పరిష్కారం చూపుతాయని దీని ద్వారా నేర్చుకోవచ్చు.

- ఆర్థిక క్రమశిక్షణ

వేకల నిర్వహణ డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. ఎంత ఖర్చు వస్తుంది ? ఆర్థిక వన రులు ఎలా సమకూర్చుకోవాలి? అని ముం దుగా నిర్ణయించిన ప్రకారం చందాలు వసూ లు చేస్తారు. వచ్చిన డబ్బును వేటికి, ఎంత ఖర్చు చేయాలి? అని అందరూ సమష్టిగా నిర్ణయించుకుని పొదుపుగా వాడుతారు. ఇది డబ్బును ఆచితూచి వాడడంతో పాటు వ్యాపా ర నైపుణ్యాలను అలవచ్చుతుంది.

- నాయకత్వ లక్షణాలు

ప్రతి ఒక్కరూ ముందు ఉండి వేడుకను విజయవంతం చేయాడానికి కలిసికట్టుగా సాగుతారు. ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను పం చుకుంటూ సమన్వయంతో వ్యవహరిస్తారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవం తంగా పూర్తిచేస్తారు. ప్రతీ ఒక్కరూ తామే నాయకుడిగా భావిస్తూ మిగిలిన వారికి కూడా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. జీవితంలో నాయకత్వ లక్షణాలు ఎంతో కీలకంఅని ఇది స్పష్టం చేస్తుంది.

- సమష్టి సహకారం

ఏ పని విజయవంతం కావాలన్నా సమష్టి సహకారం ఎంతో అవసరం. నవరాత్రోత్సవాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహ ఎంపిక నుంచి మండపం ఏర్పాటు, అలంకరణ, పూజా కార్యక్ర మాల నిర్వహణ, గణేశుడి నిమజ్జనం, ఇలా విఘ్నా లు లేకుండా అన్ని కార్యక్రమాలను సమిష్టిగా పూర్తి చేస్తారు. అందరితో కలిసి పనిచేయాలన్న అంతరా ర్థాన్ని నవరాత్రోత్సవాలు బోధిస్తాయి.

- సంక్షోభాల నివారణ

ఉత్సవాల సమయంలో అకస్మత్తుగా వర్షం పడడం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎవరూ కంగారు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తారు. విగ్రహాల తరలింపు సమ యంలో ఆటంకాలు ఎదరైనప్పుడు శాంతంగా ఆలోచిస్తారు. సంక్షోభాలు తలెత్తినప్పుడు ఎలా నివారించాలన్న మెలుకువలను నవరా త్రోత్సవాలు నేర్పిస్తాయి.

- సహనం, ఓర్పు

తొమ్మిది రోజుల పాటు నియమ, నిష్ఠలకు లోబడి చిత్తశుద్దితో వేరుకలు నిర్వహిస్తారు. నిద్ర, ఆలసటను లెక్కచేయకుండా సమయ పాలన పాటిస్తూ ఉత్సవాల్లో పాలుపం చుకుంటారు. దీని వల్ల సహనం, ఓర్పు, క్రమశిక్షణ, అంకితభావం ఆలవడుతాయి.

- చట్టాలపై గౌరవం

మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ప్రతీ అంశంలో నిబంధనలను పాటించాల్సిందే. పోలీస్‌, విద్యుత్‌ శాఖల అధికారులకు సహకరిస్తూ చట్టానికి లోబడి ఉత్సవాలను నిర్వహించాల్సి ఉంటుంది. దీని వల్ల చట్టాలపై గౌరవం పెరగడం తోపాటు క్రమబద్దమైన జీవితాన్ని అవలంబిం చాలన్న విసయాన్ని ఈ ఉత్సవాలు చెబుతాయి.

- సామాజిక బాధ్యత

నిమజ్జన ఉరేగింపు వేలాది మందితో సాగుతుంటుంది. ఎవరికీ ఇబ్బంది కలగ కుం డా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసు కోవాల్సి ఉంటుంది. ఎవరికి హాని చేయకూ డదని, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అన్న సామాజిక స్పృహ, బాధ్యతను ఈ ఉత్సవాలు పెంచుతాయి. వయసు, వర్గం అన్న తారతమ్యం లేకుండా ఉత్సవాల్లో పాల్గొ నడం వల్ల అందరూ ఒక్కటే అన్న సమానత్వ ధోరణిని ఉత్సవాలు చాటుతాయి.

- త్యజించే తత్వం

వినాయకుడి విగ్రహాన్ని ఎంత ఇష్టంగా ఏరికోరి తెచ్చుకున్నా.. ఎంత భక్తిశ్రద్దలతో కొలిచినా చివరికి నీటిలో నిమజ్జనం చేయక తప్పదు. దేనిపైనా అనవసర మమకారాలను పెంచుకోవద్దని, ఎంత ప్రేమ పెంచుకున్నా అవసరమైనప్పుడు కొన్ని వదు లు కోవాల్సిందేనని నిమజ్జనం పాఠం చెబుతుంది. త్యజించే తత్వాన్ని అలవర్చుతుంది.

Updated Date - Sep 12 , 2026 | 11:39 PM