Share News

kumaram bheem asifabad- గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:40 PM

గణేశ్‌ నిమజ్జనం నిర్వాహకులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాళేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కాగజ్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని పెద్దవాగు ప్రాంతంల గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను కాలేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా జిల్లా ఎస్పీ నితికాపంత్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు

kumaram bheem asifabad- గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
పెద్దవాగు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న కాళేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ నిమజ్జనం నిర్వాహకులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాళేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కాగజ్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని పెద్దవాగు ప్రాంతంల గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను కాలేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా జిల్లా ఎస్పీ నితికాపంత్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. పెద్దవాగు వద్ద గణేశ్‌ నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది, బందోబస్తు ఏర్పాట్లు, మంచినీటి వసతి, విద్యుత్‌ దీపాల సౌకర్యం తదితర ఏర్పాట్లుపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వహిదుద్దీన్‌, సీఐ ప్రేంకుమార్‌, కుమార స్వామి, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-1 డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిం చారు. విఽధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును, స్టేషన్‌కు సంబంఽధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం సిఐ, స్టేషన్‌ రైటర్‌, సీసీటీఎన్‌ఎస్‌ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌ వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్‌ ప్రక్రియపై ఆరా తీశారు. స్టేషన్‌ పరిఽధిలో తరుచూగా నమోదు అయ్యే నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతి భధ్రతల పరిస్థితి, స్టేషన్‌ నిర్వహణ తదితర అంశాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాఽధితులు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రౌడిషీటర్లు, సస్పెక్టు షీట్‌లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Sep 22 , 2026 | 10:40 PM