Share News

వచ్చేది బీసీల రాజ్యమే

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:24 PM

కాంగ్రెస్‌ మోసా లు ఎంతోకాలం సాగవని, రానున్నది బీసీల రాజ్యమే నని తెలంగాణ రాజ్యాధి కార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్‌ మల్లన్న అన్నారు.

వచ్చేది బీసీల రాజ్యమే
మద్దూర్‌ పాత బస్టాండ్‌ చౌరస్తాలో రోడ్‌షోలో మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న

- టీఆర్పీ వ్యవస్థాపకుడు తీన్మార్‌ మల్లన్న

మద్దూర్‌/గుండుమాల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్‌ మోసా లు ఎంతోకాలం సాగవని, రానున్నది బీసీల రాజ్యమే నని తెలంగాణ రాజ్యాధి కార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్‌ మల్లన్న అన్నారు. పాదయాత్రలో భాగంగా సోమవారం మద్దూర్‌కు చేరుకున్న ఆయన స్థానిక పాత బస్టాండ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడారు. మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంద న్నారు. 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చినట్టు ఇచ్చి అది అమలు కాకుండా పరోక్షంగా ప్రభుత్వమే అడ్డుకుందన్నారు. రోడ్డు విస్తరణ, నారాయణ పేట-కొడంగల్‌ ఎత్తిపోతలలో ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు పరిహారం ఇచ్చాకే ప నులు మొదలుపెట్టాలన్నారు. అదేవిధంగా, గుం డుమాల్‌లోని శివాజీ చౌక్‌లో నిర్వహించిన స మావేశంలో తీన్మార్‌ మల్లన్న మాట్లాడారు. అధి కారంలోకి వచ్చాక అభివృద్ధి పనులను బీసీలతో చేపడుతామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆం ధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవే ర్చనందుకే రాష్ట్ర ప్రజ లు కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడరని గు ర్తు చేశారు. ఇక రేవంత్‌రెడ్డి పాలన ముగిసే స మయం దగ్గర పడిందన్నారు. రానున్న ఎన్నిక ల్లో బీసీలంతా ఏకమై బీసీ ఎమ్మెల్యేలను గెలి పించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో నాయకులు బోయిని వెంకటయ్య, శ్రీనివాస్‌, దత్తు, కృష్ణయ్య, హన్మంతు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:24 PM