సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:52 PM
రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్ర జలకు చేరేందుకు వారికి అం దు బాటులో ఉంటానని నాగ ర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యు డు మల్లు రవి అన్నారు.
బిజినేపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్ర జలకు చేరేందుకు వారికి అం దు బాటులో ఉంటానని నాగ ర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యు డు మల్లు రవి అన్నారు. మం డల కేంద్రమైన బిజినేపల్లి సర్పంచ్ మిద్దె ఇందిరారాము ఇంట్లో సోమవారం రాత్రి బస చేసి స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంగళవా రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడు తూ ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, ప్రతీ ఒక్క రికి బిల్లులు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నా రు. ఎనిమిది నెలలుగా కమీషన్ రావడం లేదని తెలుపుతూ మండల రేషన్ డీలర్లు ఎంపీకి వినతి పత్రం అందజేశారు. లట్టుపల్లి సర్పంచ్ శివలీలచంద్రగౌడ్, మంగనూర్ సర్పంచ్ జాలం నాగయ్యలు ఎంపీ మల్లు రవిని ఘనంగా సన్మా నించారు. ఆయన వెంట మాజీ సర్పంచులు గంగనమోని తిరుపతయ్య, రాంచందర్, మాజీ జెడ్పీటీసీ పరశురాములు, శ్రీనివాస్ బహదూ ర్, వాల్యానాయక్, వెంకటేష్‌గౌడ్, రంగ నరేం దర్, మహేష్, రాజేష్, మధుసూదన్‌రెడ్డి, మిద్దె సూరి ఉన్నారు.